IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
- ముల్లాన్‌పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ టెస్ట్
- యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం
- తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే మెరిసిన మానవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manav Suthar Family Left Stadium Due to Superstition: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 15.5 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు కీలక వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే డెబ్యూ మ్యాచ్, ఈ అద్భుత ప్రదర్శనను మానవ్ సుతార్ కుటుంబ సభ్యులు స్టేడియంలో ప్రత్యక్షంగా చూడకపోవడం ఆసక్తికరంగా మారింది. ముల్లాన్‌పూర్‌కు వచ్చి.. మ్యాచ్ చూడకుండా వెళ్లిపోవడం విశేషం.
ఏమైనా అపశకునం జరుగుతుందేమో:
డెబ్యూ ఆటగాడు మానవ్ సుతార్ తండ్రి జగదీష్ సుతార్ రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా నుంచి తన భార్య, కుమార్తెతో కలిసి కుమారుడి టెస్ట్ అరంగేట్రాన్ని చూడటానికి ముల్లాన్‌పూర్‌కు వచ్చారు. మొదటి రోజు మానవ్ భారత జట్టు తరఫున టెస్ట్ క్యాప్ అందుకున్న క్షణాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అయితే రెండో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందే కుటుంబ సభ్యులంతా తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మానవ్ సుతార్ తండ్రి జగదీష్ స్వయంగా చెప్పారు. ‘మేమంతా చాలా టెన్షన్‌కు గురయ్యాం. స్టేడియంలో కూర్చొని మా కుమారుడి ఆటను ప్రత్యక్షంగా చూడటం వల్ల ఏమైనా అపశకునం జరుగుతుందేమో అన్న చిన్న మూఢనమ్మకం కూడా ఉంది. అందుకే రెండోరోజు మేము అందరం ఇంటికి తిరిగి వచ్చేశాం’ అని జగదీష్ వెల్లడించారు.
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
ఎలాంటి క్రెడిట్ తీసుకోను:
తన కుమారుడి విజయానికి తాను ఎలాంటి క్రెడిట్ తీసుకోనని జగదీష్ సుతార్ స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా మానవ్ సుతార్ కష్టానికి దక్కిన ఫలితం. చిన్నప్పటి నుంచి గంటల తరబడి సాధన చేసేవాడు. ఉదయం ట్రైనింగ్‌కు వెళ్లి సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. అతని ఎదుగుదలలో కోచ్ ధీరజ్ శర్మ పాత్ర కూడా చాలా కీలకం. మానవ్ తన క్రికెట్ ప్రయాణమంతా ఆయన వద్దే నేర్చుకున్నాడు’ అని జగదీష్ చెప్పారు.
చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి:
మానవ్లో ప్రతిభను ఎప్పుడు గుర్తించారని అడగగా.. అది ఒక్కరోజులో గుర్తించిన విషయం కాదని తండ్రి జగదీష్ తెలిపారు. ‘ఆరేడు ఏళ్ల వయసు నుంచే టెన్నిస్ బాల్, రబ్బర్ బాల్‌తో మానవ్ క్రికెట్ ఆడేవాడు. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావడంతో క్రీడలను ఎప్పుడూ ప్రోత్సహించేవాడిని. 10-11 ఏళ్ల వయసులో ధీరజ్ శర్మ అకాడమీలో చేర్పించాను. నీకు నచ్చిన మార్గంలో వెళ్లు, నా పూర్తి మద్దతు నీకు ఎప్పుడూ ఉంటుందని చెప్పాను’ అని వివరించారు.
చదువులతో పాటు క్రికెట్:
క్రికెట్ కారణంగా చదువులు దెబ్బతింటాయనే ఆందోళన ఎప్పుడూ కలగలేదని జగదీష్ సుతార్ చెప్పారు. ‘క్రికెట్ మానవ్ ప్రధాన లక్ష్యం అయినప్పటికీ చదువును కూడా పూర్తి చేశాడు. ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు మేము క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడం. మానవ్ కూడా చాలా తక్కువ మాట్లాడుతాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్‌కు అతడు పెద్ద అభిమాని. ప్రపంచ క్రికెట్‌పై అశ్విన్ చూపిన ఆధిపత్యాన్ని ఎంతో ఇష్టపడతాడు’ అని జగదీష్ చెప్పారు.
అరంగేట్రంలోనే అదరగొట్టిన మానవ్:
అఫ్గానిస్థాన్‌పై తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అబ్దుల్ మాలిక్, రహ్మనుల్లా గుర్బాజ్, అఫ్సర్ జజాయ్ వికెట్లు తీసి అఫ్గాన్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. భారత బౌలింగ్ దళంలో ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి కీలక పాత్ర పోషిస్తూ.. భారత జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడంతో భారత క్రికెట్‌కు మరో ప్రతిభావంతమైన స్పిన్నర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!