IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!
- అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడో వన్డే
- భారత జట్టులో కీలక మార్పు
- హర్షిత్ రాణా రీహాబిలిటేషన్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Update Squad vs Afghanistan 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 కైవసం చేసుకుంది. నామమాత్రమైన చివరి వన్డే మ్యాచ్ చెన్నైలో శనివారం (జూన్ 20) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మళ్లీ భారత జట్టులో చేరాడు. చెన్నైలో శనివారం జరిగే మూడో వన్డేకు ముందు అతడు జట్టుతో కలవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలి గాయానికి గురయ్యాడు. దాంతో అతడు ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్ 2026 సీజన్లో కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగలేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఏ)లో పునరావాస ప్రక్రియ పూర్తి చేసిన హర్షిత్.. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా మారాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు. ‘హర్షిత్ రాణా తన రీహాబిలిటేషన్ పూర్తి చేసుకుని చెన్నైలో భారత వన్డే జట్టుతో చేరాడు’ అని వెల్లడించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
24 ఏళ్ల హర్షిత్ రాణా ఇప్పటివరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 27.38 కాగా.. ఎకానమీ రేటు 6.21గా ఉంది. వేగం, బౌన్స్‌తో పాటు డెత్ ఓవర్లలో కూడా ప్రభావం చూపగల సామర్థ్యం అతనికి ఉంది. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారిగా ఆడాడు. ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకునే అవకాశం పొందాడు. రాణాను భారత సెలెక్టర్లు రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేశారు. ఈ పర్యటనలో భారత్ మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిట్నెస్ నిరూపించుకున్న హర్షిత్‌కు ఇది కీలక సిరీస్‌గా మారనుంది.
అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!