KL Rahul: రాహుల్‌ను ల్యాబ్‌లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని చేపాక్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను భారత జట్టు తుది ఎంపిక (ప్లేయింగ్ XI) నుండి మినహాయించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘జస్టిస్ ఫర్ కేఎల్ రాహుల్’ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ప్రయోగాల కోసం రాహుల్‌ను మాత్రమే ఎందుకు బలిపశువును చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు ప్రకటించాడు. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌ల స్థానాల్లో హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణలకు జట్టులో అవకాశం కల్పించారు. అయితే, రాహుల్‌కు విశ్రాంతినిచ్చారా లేదా జట్టు నుండి తొలగించారా అనే విషయాన్ని గిల్ స్పష్టం చేయలేదు. తదుపరి జరగబోయే టీ20 సిరీస్‌లలో రాహుల్ ఆడటం లేదని, అలాంటప్పుడు వన్డే జట్టులో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టకుండా రాహుల్‌ను ఎందుకు దూరం పెట్టారని అభిమానులు నిలదీస్తున్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
Tagline revealed:
KL RAHUL THE EASY SCAPEGOATBlud gave his everything for the team yet they dropped him pic.twitter.com/vLYFl7LdTw
— Rahulify¹ (@Rahulify1) June 20, 2026
KL RAHUL is Rested, who will not play the next two T20i series yet Iyer is playing.
1st match KL batted at 5
2nd match they pushed down KL at 6
3rd match KL is rested nowBut Why always experimenting with KL?
— Jyotirmay Das (@dasjy0tirmay) June 20, 2026
They treat KL Rahul like lab rat.
For any experiment , he gets sidelined at the drop of a hat.
Unfair and ridiculous. https://t.co/ToM4eAIPsi— Yukti (@sweetpotayayto) June 20, 2026
ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. మొదటి వన్డేలో ఐదో స్థానంలో ఆడిన రాహుల్‌ను, రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కోసం మరో స్థానానికి మార్చారు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తొలగించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక అభిమాని స్పందిస్తూ.. “టీమ్ ఇండియా యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను ప్రయోగశాలలోని ఎలుకలా (ల్యాబ్ రాట్) వాడుకుంటోంది. ఏ ప్రయోగం చేయాలన్నా మొదట అతడినే పక్కన పెడుతున్నారు, ఇది చాలా అన్యాయం” అని మండిపడ్డాడు. మరికొందరు రాహుల్‌ను ఒక ఈజీ టార్గెట్‌గా మార్చేశారని వాపోయారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!