Site icon NTV Telugu

Jasprit Bumrah: ఈ ఓటమి చాలా బాధగా అనిపిస్తుంది.. నేను ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది

Bumra

Bumra

Jasprit Bumrah: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. 3-1 తేడాతో పదేళ్ల తర్వాత బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకుంది. టోర్నీలో భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా 32 వికెట్లు తీసి టాప్‌ వికెట్ టేకర్‌గా నిలవడగా.. అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు వచ్చింది. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో బౌలింగ్‌కు రాలేదు అతడు. మ్యాచ్‌ తర్వాత బుమ్రా మాట్లాడుతూ.. ఈ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. కీలక సమయంలో బౌలింగ్‌ చేయలేకపోయినందుకు బాధగా ఉందన్నాడు. కానీ, మన శరీరాన్ని గౌరవించాలి.. దాంతో మనం పోరాటం చేయలేం.. శరీరం బాగుంటేనే ఏదైనా చేస్తామని బుమ్రా వెల్లడించారు.

Read Also: Jailer 2 : సూపర్ స్టార్ ‘జైలర్‌ – 2’ సినిమా రెగ్యులర్ షూట్.. ఎప్పటి నుంచి అంటే ?

ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడే కాస్త ఇబ్బందిగా అనిపించింది.. వెన్ను నొప్పిపై వైద్య బృందంతో చర్చించాను అని టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ బుమ్రా తెలిపాడు. జట్టులోని సహచరులు బాధ్యత తీసుకునేందుకు ముందుకు రావడంతో.. ఒక బౌలర్‌ తక్కువైనప్పటికీ ఆసీస్‌ను కట్టడి చేయగలిగాం అన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మా బౌలర్లు చేసిన పోరాటం సరిపోలేదని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు.. వారు ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకున్నారు.. ఈ సిరీస్ తో వారు మంచి అనుభవం సాధించారు అని బుమ్రా చెప్పుకొచ్చారు.

Exit mobile version