ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(891) తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(886) రెండో స్థానానికి పడిపోయాడు. ఇక ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(878) అదే మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(814) ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి రాగ… తాజాగా కివీస్ పైన రాణించని ఇంగ్లండ్ సారథి జో రూట్(797) ఐదో స్థానానికి పడిపోయాడు. ఇక భారత ఆటగాళ్లలో టాప్ 10 లో రిషబ్ పంత్ (794), రోహిత్ శర్మ (747) ఇద్దరూ ఆరో స్థానంలో నిలిచారు. అలా బౌలింగ్ విభాగంలో టాప్-10లో రవిచంద్రన్ అశ్విన్ (850) రెండో స్థానంలో ఉండగా… ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.