Asia Cup Super-4: ఫరీద్, అలీ ఫీజుల్లో 25% కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Punished Fareed Ahmad and Asif Ali For Breaching Code Of Conduct: క్రికెట్లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ సాధారణమే. కానీ, అంతకుమించి హద్దుమీరితే మాత్రం చర్యలు తప్పవు. ఫీజుల్లో నుంచి కోత విధించడమో, కొన్నిసార్లు పలు మ్యాచ్ నుంచి ప్లేయర్లను నిషేధించడమో జరుగుతుంటుంది. అయితే.. ఏదో పెద్ద వివాదం జరిగితే తప్ప ఫలానా ఆటగాళ్లపై బ్యాన్ విధించరు. సాధ్యమైనంత వరకు జరినామాలే వేస్తుంటారు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు చెందిన ఆసిఫ్ అలీ, ఫరీద్ అహ్మద్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి జరిమానా విధించింది. వారి ఫీజుల్లో నుంచి 25% కోత వేసింది.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా బుధవారం (సెప్టెంబర్) పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ, ఫరీద్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! 19వ ఓవర్లో చివరి బంతికి అలీని ఔట్ చేసిన తర్వాత, ఫరీద్ అతని మీదకి జోష్‌తో వెళ్లాడు. చాలా దగ్గరగా వెళ్లి, నిన్ను ఔట్ చేశాను అనే సంజ్ఞతో గట్టిగా కేకలు వేశాడు. అసలే ఔట్ అయిన బాధలో ఉన్న అలీ, అతని చర్యతో కోపాద్రిక్తుడై అతనిపై బ్యాట్‌తో దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అప్పుడు వెంటనే ఆఫ్ఘన్ ఆటగాళ్లు జోక్యం చేసుకొని, ఇద్దరిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ..
- RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
- IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
ఇలా ఫరీద్, ఆసిఫ్ నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం వల్ల.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వారిపై చర్యలు తీసుకుంది. ఇద్దరి ఫీజుల్లో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళి ప్రకారం.. ఆర్టికల్ 2.6ను ఆసిఫ్ అలీ, ఆర్టికల్ 2.1.12 రూల్స్‌ను ఫరీద్ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది. ఇక ఆ ఇద్దరు ప్లేయర్లు కూడా తాము తప్పు చేసుకున్నట్టు అంగీకరించారు. కాగా.. ఈ ఘటనతో పాటు పాక్ చేతిలో ఆఫ్ఘన్ ఓడిపోవడంతో, ఆఫ్ఘన్ అభిమానులు మైదానంలోనే పాక్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడిన విషయం విదితమే!
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!