Site icon NTV Telugu

Harmanpreet Kaur: అదే మా అసలైన బలం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ ఆనందం!

Harmanpreet Kaur

Harmanpreet Kaur

ఈ మ్యాచ్‌ తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందని ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో ముంబై జట్టు ప్రదర్శించిన ఆటపై పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘ఈ రోజు మేము ఆడిన విధానం చాలా సంతోషం కలిగించింది. గత మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడంతో చాలా నిరాశపడ్డాం. కానీ ఈ రోజు మరింత బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను అమలు చేశాం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపారు. డబ్ల్యూపీఎల్‌-4లో భాగంగా శనివారం ముంబై 50 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. హర్మన్‌ప్రీత్‌ (74 నాటౌట్‌; 42 బంతుల్లో 8×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.

Also Read: IND vs ENG: న్యూజిలాండ్‌తో మొదటి వన్డే.. బరిలోకి శ్రేయస్‌ అయ్యర్‌, తుది టీమ్ ఇదే!

‘గత మ్యాచ్‌లో కూడా నాకు మంచి ఆరంభం లభించింది. కానీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాను. ఈ రోజు బ్యాటింగ్‌కు వెళ్లేముందు నేను నాతోనే మాట్లాడుకున్నాను. నిన్నటి దాని గురించి ఆలోచించకుండా..ఈ రోజు కొత్త రోజు, కొత్త ఇన్నింగ్స్ అనే ఆలోచనతో మైదానంలోకి దిగాను. నా బ్యాటింగ్‌కు పూర్తి క్రెడిట్ భారత జట్టు, ఇప్పుడు ఉన్న ముంబై జట్టుకూ ఇస్తాను. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అది నేను స్వేచ్ఛగా ఆడేలా చేసింది. గత మ్యాచ్‌ చివరి దశలో ఒక మంచి బంతి వేస్తే సరిపోయేది. దురదృష్టవశాత్తు అది జరగలేదు. అయినా కూడా చివరి వరకు మేము మ్యాచ్‌లోనే ఉన్నాం. అదే మాకు ఈ రోజు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నిన్న సరిగా ఆడకపోయినా మ్యాచ్‌లో నిలబడ్డామంటే.. నమ్మకం, ఆత్మవిశ్వసమే కారణం. నిజం చెప్పాలంటే ప్రతి వికెట్‌ నాకు ఆనందాన్ని ఇచ్చింది. టీ20 క్రికెట్‌లో 10 వికెట్లు తీస్తే.. ఓ సారథిగా అంతకంటే జట్టు నుంచి మరేమీ కోరలేం. మా ఫీల్డింగ్‌పై చాలా సంతోషంగా ఉంది’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version