Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur Praises Deepti Sharma: వుమెన్స్ ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. సెమీ ఫైనల్-1లో బంగ్లాదేశ్ మహిళల జట్టును 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు ప్రదర్శన తీరు పట్ల తాను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పింది.
‘ఈ రోజు జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. మా ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న విధానం బాగుంది. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని సమర్థంగా రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. బంతికి మంచి టర్న్, రివల్యూషన్స్ ఇస్తే దానికి తగిన ఫలితం దక్కింది. ఈరోజు ఇరు జట్ల స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పరుగులు సాధించేందుకు బ్యాటర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఇలాంటి పిచ్‌పై చిన్న భాగస్వామ్యాలే ఎంతో కీలకం అవుతాయి. పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగా అంచనా వేయలేని పిచ్‌పై చిన్నచిన్న భాగస్వామ్యాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. భారత్ బ్యాటింగ్ సమయంలో నమోదైన ప్రతి భాగస్వామ్యం ఎంతో కీలకంగా మారింది’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది.
Also Read
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
రిచా ఘోష్ బ్యాటింగ్‌ను కూడా భారత కెప్టెన్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ‘రిచా ఘోష్ బ్యాటింగ్ అద్భుతం. కొన్ని అద్భుతమైన షాట్లు ఆడింది. ఆ పరుగులు జట్టుకు ఎంతో విలువైనవి. బౌలింగ్‌లో దీప్తి శర్మ అద్భుతమే చేసింది. జట్టుకు వికెట్లు అవసరమైన ప్రతిసారీ దీప్తి నేనున్నానని ముందుకొస్తుంది. కీలక బ్రేక్‌థ్రూలు ఇస్తుంది. ఈరోజు కూడా దీప్తి అదే పని చేసింది. ఆమె జట్టుకు విలువైన ఆస్తి. ఎన్నో మ్యాచ్‌లలో టీమిండియాకు విజయాలు అందించింది’ అని హర్మన్‌ప్రీత్ ప్రశంసలు కురిపించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించడం ఈ విజయానికి ప్రధాన కారణం అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!