IND vs NZ: ఇవేం పిచ్‌లు.. మరీ ఇంత చెత్తగా ఉన్నాయ్: హార్దిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ చప్పగా సాగింది. టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా స్లో ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లున్నా ఒక్క సిక్స్ కూడా నమోదవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇదే విషయమై మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పిచ్ క్యూరేటర్లపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఇవేం పిచ్‌లు అంటూ మండిపడ్డాడు. మ్యాచే కాదు తొలి మ్యాచ్ పిచ్ కూడా అలాగే ఉందని, తాము ఆడబోయే స్టేడియాల్లో పిచ్‌లను ముందుగానే తయారు చేసేలా చూడాలని అన్నాడు.
“నిజాయతీగా చెప్పాలంటే ఈ పిచ్ చాలా దారుణంగా ఉంది. ఈ సిరీస్‌లో మేం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే పరిస్థితి. క్లిష్టమైన వికెట్లు అయితే పర్వాలేదు. ఆ సవాలుకు సిద్ధం. కానీ ఈ రెండు పిచ్‌లు అసలు టీ20ల కోసం తయారు చేసినవైతే కావు. మేము ఆడబోయే గ్రౌండ్లలో పిచ్‌లను చాలా ముందుగానే సిద్ధం చేసేలా క్యూరేటర్లు చూస్తే బాగుంటుంది. లక్నోలోని పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించింది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టంగా అనిపించింది. రెండు జట్లలోని హిట్టర్లు కూడా ఈ పిచ్‌పై బౌలర్లకు తలవంచాల్సి వచ్చింది. ఈ పిచ్‌పై 120 కూడా గెలిచే లక్ష్యమే. మా బౌలర్లు తమ ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసి బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయకుండా చూశారు. స్పిన్నర్లను మార్చిమార్చి బౌలింగ్ చేయించాం. పొగమంచు ప్రభావం పెద్దగా లేదు. వాళ్లు మా కంటే బాగా స్పిన్ చేయగలిగారు. కానీ పిచ్ మాత్రం నిజంగా షాక్ కు గురి చేసింది” అని హార్దిక్ స్పష్టం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేయగా.. మూడో టీ20 బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్‌లో జరగనుంది.
Also Read
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
తాజావార్తలు
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!