భారత టెస్ట్ జట్టు ఆటగాడు హనుమ విహారి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన తర్వాత మళ్ళీ ఆ తరహా ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. అలాగే ఈమధ్య ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోకి కనీసం అతడిని ఎంపిక కూడా చేయకుండా… దక్షిణాఫ్రికా వెళ్తున్న భారత ఏ జట్టులో చేర్చారు. కివీస్ తో సిరీస్ తర్వాత భారత జట్టు అక్కడికి వెళ్లనున్న కారణంగా ముందే విహారిని దక్షిణాఫ్రికా పంపించారు అని అన్నారు. కానీ ఇప్పుడు అతనికి అక్కడ టెస్ట్ జట్టులో కనీసం స్థానం ఉంటుందా.. లేదా అనేది తెలియడం లేదు అని భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అన్నారు.
అయితే భారత్ A తరపున ఆడుతున్న విహారి రెండు మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా A పై 75.50 సగటుతో 151 పరుగులు చేశాడు. కానీ ఇప్పుడు భారత జట్టులో ఉన్న అందరు బ్యాటర్లు ఆ ప్రదర్శన కనబరుస్తున్నారని… కాబట్టి భారత మేనేజ్‌మెంట్ విహారికి జట్టులో ఎలా… ఈ స్థానంలో ఉంచుతుందో చూడాలి అని కార్తీక్ అన్నాడు. అతను కివీస్ తో టెస్ట్ సిరీస్ లోనే ఉండాలి.. కానీ భారత్ A తరపున ఆడటం చాలా బాధాకరం అని కార్తీక్ అన్నారు.