NTV Telugu Site icon

GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్

Mi Vs Gt

Mi Vs Gt

Gujarat Titans Won The Toss And Chose To Field Against Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ముంబై జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు గెలిస్తే.. ప్లేఆఫ్స్‌లో తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంటుంది. అప్పుడు ముంబై జట్టుకి ప్లేఆఫ్స్‌ ఆశలు కష్టతరం అవుతాయి. ఇతర జట్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం.. దాదాపు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నట్టే. అఫ్‌కోర్స్.. ఆల్రెడీ ముంబై జట్టు టాప్-4లో నాల్గవ స్థానంలో ఉంది. కానీ.. రన్ రేట్ మాత్రం నెగెటివ్‌లో ఉంది. దీనికితోడు ఫ్లేఆఫ్స్‌లో చోటు కోసం ఇంకా చాలా జట్లు తలపడుతున్నాయి. వారితో పోటీ ఉండకుండా ఉండాలంటే.. ముంబై ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఒకరకంగా.. ముంబై జట్టుకి ఇది డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట!

Yashasvi Jaiswal: జైస్వాల్ వీరవిహారం.. దెబ్బకు ఐదు రికార్డులు మటాష్

ఇప్పటికే ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో ఒకసారి తలపడ్డాయి. ఏప్రిల్ 25న మ్యాచ్ జరగ్గా.. ఏకంగా 55 పరుగుల తేడాతో జీటీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జీటీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితం అయ్యింది. నేహాల్ వధేరా (40) మినహాయిస్తే.. మిగతా ముంబై బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో, ముంబై జట్టుకి ఆ ఘోర పరాజయం తప్పలేదు. మరి.. అందుకు ముంబై జట్టు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా? జీటీని ఓడిస్తుందా? అప్పుడు ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు పామ్‌లోకి తిరిగొచ్చారు. వాళ్లు ఫామ్‌లోకి వచ్చినప్పటి నుంచి ముంబై జట్టు విజయాలు నమోదు చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ వాళ్లు సత్తా చాటితే.. ముంబై విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అలాగని జీటీ జట్టుని తక్కువ అంచనా వేయలేము. ఈ సీజన్‌లోనే అత్యధిక విజయాలతో ఇది టాప్-1 ప్లేస్‌లో ఉంది. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తోంది కాబట్టి, దూసుకుపోతోంది. అలాంటి జట్టుపై గెలుపొందాలంటే.. ముంబై అన్ని విభాగాల్లో రాణించాలి.

Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్