T20 World Cup: హమ్మయ్య ఐరన్ లెగ్ అంపైర్ లేడు.. భారత్ విజయం పక్కా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఈవారం నాకౌట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. బుధవారం నాడు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. గురువారం నాడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మేరు సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరీ) జాబితాను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా రిచర్డ్ కెటిల్‌బరో, మైఖేల్ గాఫ్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీ బాధ్యతలు చేపడతాడు.
అటు భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు కుమార ధర్మసేన- పాల్ రీఫెల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. క్రిస్ గాఫ్‌నే మూడో అంపైర్‌గా, రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ జాబితాను చూసి భారత అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దరిద్రపుగొట్టు అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేడని, ఇది భారత్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్ ఓడిపోయిన ప్రతి మ్యాచ్‌కు అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరోనే ఉన్నాడు. దీంతో గత 9 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కెటిల్ బరోనే కారణమని, ఈసారి అతను లేడు కాబట్టి సెమీస్‌లో భారత్ విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ కూడా భారత్‌దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెమీస్‌లో ఇంగ్లండ్ చిత్తవ్వడం ఖాయమని, ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చినా.. పాక్ తలపడినా.. రోహిత్ సేన విజయాన్ని ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
- Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
- IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్ లేదా థర్డ్ అంపైర్‌గా వ్యవహరించిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లను టీమిండియా ఓడిపోయింది. దీంతో రిచర్డ్ కెటిల్‌బరో ఐరన్ లెగ్ అని టీమిండియా అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

తాజావార్తలు
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!