Virat Kohli 100th Test: కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్టుకు స్టేడియంలోకి 50శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం నుంచి ఈ మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. కరోనా కారణంగా స్టేడియంలోకి అభిమానులకు అనుమతి లేదని మొదట ప్రకటించారు. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజా నిర్ణయంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రేక్షకులను అనుమతించే విషయమై పంజాబ్ క్రికెట్ సంఘంతో చర్చించామని, కోహ్లీ కెరీర్ లో ముఖ్యమైన 100వ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడంపై వారు సానుకూలంగా స్పందించారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్బీర్ కపూర్ బర్త్డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!