Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Sends Strong Message to Team India: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా ఆటగాళ్లకు కీలక సందేశం ఇచ్చాడు. భారత జట్టు ప్రతి సవాల్‌కు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని.. తొలి రోజు నుంచే అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించాడు. ప్రస్తుతం భారత జట్టు కొలంబోలోని ఎన్సీసీ మైదానంలో ప్రాక్టీస్ సెషన్ నిర్వహిస్తోంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు ఇదే వేదికలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం గాలేకు వెళ్లనున్న టీమిండియా.. ఆగస్టు 15న తొలి టెస్టులో శ్రీలంకతో తలపడుతుంది.
టెస్టు సిరీస్ సందర్భంగా బీసీసీఐ టీవీలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘మన ముందున్న సవాలు ఏమిటో అందరికీ తెలుసు. మనం దేనికోసం పోరాడుతున్నామో కూడా తెలుసు. అందరూ బాగా శ్రమించాలి. గతంలో కంటే ఎక్కువగా కష్టపడాలి. ప్రతి అంశంలో సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 15 ఉదయం బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా.. ప్రత్యర్థి విసిరే ప్రతి సవాలుకు మన దగ్గర సమాధానం ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే అన్ని విషయాల్లో బాగా సిద్ధం కావాలి’ అని ఆటగాళ్లకు పిలుపునిచ్చాడు.
Also Read
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
భారత టెస్టు జట్టులో కొత్తగా చోటు దక్కించుకున్న ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, యువ పేసర్ ఆకిబ్ నబీకి గంభీర్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు. అలాగే కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్‌కు కూడా జట్టులోకి స్వాగతం పలికాడు. ‘సారాంశ్.. ఇక్కడి వరకు రావడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. అవకాశం వచ్చినప్పుడు నీ కుటుంబంతో పాటు దేశానికి కూడా గర్వకారణంగా నిలవాలి. ఆకిబ్.. గత సీజన్లో అద్భుత ప్రదర్శన చేశావు. జమ్మూ కశ్మీర్‌కు రంజీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించావు. నీకు అభినందనలు. అలాగే శుభదీప్ ఘోష్‌కు కూడా స్వాగతం. ఎన్నో జట్లతో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన అనుభవం, అంకితభావం, ఉత్సాహం ఈ జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతున్నాను’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. అయితే శ్రీలంక గడ్డపై భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు చిన్నవి కావు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ ఇచ్చిన సందేశం టీమిండియా ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు