ఇండియన్ క్రికెటర్లు అడ్డం తిరుగుతున్నారు. రోహిత్-విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు మరింత ముదిరిపోయాయ్. వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యానంటున్నాడు కోహ్లీ. అనారోగ్యంతో టెస్టులకు దూరమయ్యాడు రోహిత్. ఐతే…కెప్టెన్సీ కోల్పోవటంతో కోహ్లీ మనస్తాపం చెందాడు. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లలో వివాదాలు ముదిరిపోయాయ్. మరోవైపు…కోహ్లీని దారిలో పెట్టే పనిలో పడింది బీసీసీఐ. కోహ్లీ వ్యవహార శైలి ధిక్కారమే అంటున్నాయ్ బీసీసీఐ వర్గాలు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది బీసీసీఐ.
దక్షిణాఫ్రికా టూర్ మొదలైనప్పటి నుంచి ఆ సిరీస్ కంటే కెప్టెన్సీ విషయం ఎక్కువ ప్రాధాన్యం సంతరించకుంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తొలగించి రోహిత్‌ను ఎంపిక చేసినప్పటి నుంచి సమస్య పెరిగిపోతుందే తప్ప కొలిక్కి రావడం లేదు. దీనికి తోడూ సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా ఆడనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరమవ్వడం..ఆ తర్వాత రోహిత్ సారథ్యంలో టీమిండియా ఆడనున్న వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమవుతున్నట్లు వార్తలు కలకలం రేపింది. ఈ తరుణంలో రోహిత్, కోహ్లి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయనే వార్తలు వెలువడ్డాయి.