Site icon NTV Telugu

Cricket: టీమిండియా యంగ్ ప్లేయర్ పై పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం ప్రశంసలు..

Akram

Akram

ఐపీఎల్ కొందరి క్రికెటర్ల భవిష్యత్ ను మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ ద్వారా తమ ట్యాలెంట్ ను వెలికితీసి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై పాక్‌ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రుతురాజ్ ప్యూచర్ లో టీమిండియాకు విలువైన ఆస్తిగా మారతాడని.. మొయిన్ పిల్లర్ అవుతాడని వెల్లడించాడు. అతడు మ్యాచ్ ఎంత ఒత్తిడిలోనూ రాణించగలిగాడని కొనియాడాడు. ఇంతకుముదు ఐపీఎల్ సీజన్స్ కంటే మెరుగ్గా ఈ ఐపీఎల్‌లో అతని ఆల్ రౌండ్ ప్రదర్శన బాగుందని కితాబిచ్చారు. రాబోవు రోజుల్లో అతడు భారత జట్టుకు ‘కీ’ ప్లేయర్‌గా మారతాడు. అని అక్రమ్‌ తెలిపాడు.

Also Read : Weight loss tips : పాస్తాను ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు..

ఐతే 2023 సీజన్‌లో ఓపెనర్ గా రుతురాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. తమ విలువైన భాగస్వామ్యాలతో జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ పై భారీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్.. 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 590 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read : BREAKING NEWS : ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..

ఐపీఎల్ లో ఇరగదీసిన రుతురాజ్ కు.. భారత జట్టులోకి ఎంట్రీ ఛాన్స్ లు కష్టంగా మారింది. గతేడాది జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతనికి చెప్పుకోదగ్గా అవకాశాలు రాలేదు. ఇప్పటివరకు 10 టీ20లు ఆడగా..161 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 57 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఇక ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌ ఆడగా.. అందులో 19 పరుగులు మాత్రమే చేశాడు. అటు డబ్ల్యూటీసీ ఫైనల్ లో రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికైనప్పటికీ ఆ ఛాన్స్ కూడా మిస్సైపోతుంది. ఎందుకంటే జూన్ 3వ తేదీన వివాహం ఉండటంతో ఆడలేకపోతున్నాడు. ఏదేమైనాప్పటికీ భారత జట్టులోకి అడుగుపెడితే.. రికార్డుల మోత మోగడం ఖాయమంటున్నారు పలువురు దిగ్గజాలు.

Exit mobile version