Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
- పాకిస్థాన్ మహిళల జట్టుకు మరో ఓటమి
- పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం
- ఓటమిపై నిరాశ వ్యక్తం చేసిన పాక్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatima Sana Reaction on PAKW Defeat vs SAW: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ మహిళల జట్టు ఓటమిపాలైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన పాకిస్థాన్‌ను దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు రన్స్ చేసి గెలిచింది. ఈ ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా నిరాశ వ్యక్తం చేసింది. వరుసగా రెండు మ్యాచ్లి ఓడడం చాలా బాధగా ఉందని.. ఇక టోర్నీలో తమని ఆ అల్లానే కాపాడాలని చెప్పుకొచ్చింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫాతిమా సనా.. జట్టులో పోరాట పటిమ ఉన్నప్పటికీ మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో విఫలమయ్యామని అంగీకరించింది. ‘మేము చివరి వరకు పోరాడాం. మా ప్లేయర్స్ చివరి వరకు బాగా ఆడారు. కానీ మ్యాచ్‌ను ముగించలేకపోయాం’ అని తెలిపింది. ఈ మ్యాచ్‌లో ఫాతిమా సనా, టుబా హసన్‌తో కలిసి 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ భాగస్వామ్యం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉండాలనే ఉద్దేశంతో మేము బ్యాటింగ్ చేశాం. మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. టుబా కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లలో ఒకరు. అందుకే ప్రణాళిక ప్రకారం ఆడేందుకు ప్రయత్నించాం’ అని వివరించింది.
Also Read
- Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
- BCCI: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
- Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
- Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ముందుకు రావాల్సింది అనే ప్రశ్నకు ఫాతిమా సనా సమాధానం ఇచ్చింది. ‘అది పూర్తిగా జట్టు నిర్ణయం. మేమంతా కలిసి చర్చించుకున్న తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం. జట్టు అవసరాలకు అనుగుణంగా నేను ఆ పాత్రను స్వీకరించాను’ అని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడంతో పాటు మూడు వికెట్లు కూడా తీసిన ఫాతిమా.. కెప్టెన్‌గా తన బాధ్యతలను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ‘కెప్టెన్సీ బాధ్యతను నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. కానీ కేవలం వ్యక్తిగత ప్రదర్శనలు సరిపోవు. జట్టు విజయాలు సాధించాలి. టోర్నీలో ఇంకా మేం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వరుసగా రెండు గేమ్స్ ఓడాం. ఇకనైనా విజయాల బాట పట్టాలి. లేదంటే మూల్యం చెలిచుకోవాల్సిందే’ అని తెలిపింది.
తదుపరి మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు స్పందించిన ఫాతిమా సనా.. జట్టు మరింత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అంకూలంగా లేనపుడు మరింత ప్రశాంతంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ అంశంలో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తాం. పాక్ జట్టు విజయాలే నాకు ముఖ్యం’ అని పాక్ సారథి ఫాతిమా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!