టీం ఇండియా జోరు ఏ మాత్రం తగ్గలేదు. పింక్ బాల్ టెస్ట్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే\నైట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్ సిబ్లే , జానీ బెయిర్ స్టోలు డకౌట్ కాగా.. కెప్టన్ జోరూట్ 17, బెన్ స్టోక్స్ 6, ఒలీ పోప్ 1, జాక్ లీచ్ 3, అర్చర్ 11, బెన్ ఫోక్స్ 12, బ్రాడ్ 3 పరుగులే చేసి ఘోరంగా ఫెయిలయ్యారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 48.4 ఓవర్లలో 112 పరుగులకే చాప చుట్టేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఆరు వికెట్లు తీయగా.. ఇశాంత్ శర్మ ఒక వికెట్, అశ్విన్ మూడు వికెట్లు తీశారు.