Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్‌కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్!
- మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన ఎల్లీస్ పెర్రీ
- 7 మ్యాచ్‌లలో 198 పరుగులు, 4 వికెట్స్
- క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్
- మహిళల క్రికెట్‌కు చిరునామా ఎల్లీస్ పెర్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ellyse Perry Is Greatest Women’s Cricket All-Rounder: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ స్టార్ ఎల్లీస్ పెర్రీ మరోసారి తన అద్భుత ఆటతో ప్రపంచ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఈ ఆసీస్ అందం 7 మ్యాచ్‌లలో 198 పరుగులు చేయడమే కాకుండా 4 వికెట్లు పడగొట్టింది. మెగా టోర్నమెంట్లో బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌లో49.50 సగటు, 132.88 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసింది. బౌలింగ్‌లో 7.50 సగటును కొనసాగించింది. ఆసీస్ పొట్టి కప్ గెలవడంలో పెర్రీ తన వంతు పాత్ర పోషించింది.
బ్యాట్‌తో పరుగులు, బంతితో వికెట్లు, కీలక మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలతో ఎల్లీస్ పెర్రీ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇప్పటికే తొమ్మిది ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఆమె.. ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ సరికొత్త చరిత్రలు సృష్టిస్తోంది. పెర్రీ కెరీర్లో మరో విశేషం ఏమిటంటే.. ఆమె కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఫుట్‌బాలర్ కూడా. ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆడిన అరుదైన క్రీడాకారిణి. రెండు క్రీడల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె బహుముఖ ప్రజ్ఞకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
Also Read
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
- Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
- Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
- India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 1,000కిపైగా పరుగులు చేయడంతో పాటు 100కిపైగా వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ కూడా ఎల్లీస్ పెర్రీనే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణిస్తూ మహిళల క్రికెట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. అందుకే ఆమె ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్ అయింది. టెస్టు క్రికెట్లోనూ పెర్రీ రికార్డులు సృష్టించింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌గా అజేయంగా 213 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచింది.
వ్యక్తిగత విజయాలతో పాటు జట్టు విజయాల్లోనూ ఎల్లీస్ పెర్రీ కీలక పాత్ర పోషించింది. ఆమె ఖాతాలో ఇప్పటికే 9 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. అలాగే రెండుసార్లు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ టైటిల్, ఒకసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అంతేకాదు ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును సొంతం చేసుకుని తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా నిలకడగా ఆడుతున్న పెర్రీ.. ప్రపంచవ్యాప్తంగా యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు మహిళల క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!