NTV Telugu Site icon

IPL 2023 : ఢిల్లీ ఆలౌట్.. బ్యాటింగ్ లో రెచ్చిపోతున్న ముంబై

Dd Vs Mi 1

Dd Vs Mi 1

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యా్చ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తొలి ఇన్సింగ్స్ ముగిసింది. అయితే ముంబయికి 173 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 9.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ( 51)అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. మనీశ్ పాండే ( 26) ఫర్వాలేదనిపించాడు. మనీశ్ మినహ. డేవిడ్ వార్నర్ తర్వాత వచ్చిన పృథ్వీ షా ( 15), యశ్ ధుల్ ( 2), పావెల్ ( 4), లలిత్ యాదవ్ ( 2) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అనంతరం వచ్చిన అక్షర్ పటేల్ ( 54) పరుగులు చేసి.. వార్నర్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ముంబయి బౌలర్లలో పీయుశ్ చావ్లా ( 3), జేసన్ ( 3) వికెట్లు పడగొట్టి చెలరేగిపోయాడు. హృతిక్ ( 1), రీలీ మెరెడిత్ ( 2) వికెట్లు తీసుకున్నారు.

Read Also : YSR EBC Nestham: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. రేపే వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ..

ఇక రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నారు. ఇప్పటికే 4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 49 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12 బంతుల్లో 25 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 12 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ టీమ్ ను కట్టడి చేసేందుకు వార్నర్ సరికొత్త ప్లాన్ వేశాడు. పవర్ ప్లేలో వికెట్లు తీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారోనంటూ క్రికెట్ ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తోరో చూడాలి..

Read Also : Karnataka Elections: తొలివిడతగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. 52 మంది కొత్తవారికి అవకాశం..