IND Vs SA: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. బుధవారం నుంచి సొంతగడ్డపై మరో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు సెలక్టర్లు ముందుగానే హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌కు విశ్రాంతి కల్పించారు. అటు కరోనా కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్‌రౌండర్ దీపక్ హుడా కూడా వెన్ను గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో దీపక్ హుడా స్థానంలో ఆర్‌సీబీ ఆటగాడు షాబాద్ అహ్మద్‌కు సెలక్టర్లు స్థానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also: Sanju Samson: భారత జట్టుకి నిరసన సెగ.. అతని ఫ్యాన్స్ తాండవం
అటు జడేజా, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లు దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని భావించొచ్చు. అయితే షమీ స్థానంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా ఉమేష్ యాదవ్ కొనసాగనున్నట్లు పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు నిర్ణయించారు. లెఫ్ట్ హ్యాండర్ అయిన షాబాజ్ అహ్మద్‌ను ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకునే జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు కూడా షాబాజ్ అహ్మద్ ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు పాండ్యా, హుడా లాంటి ఆల్‌రౌండర్లు లేని లోటును షాబాజ్ అహ్మద్ పూడుస్తాడా అన్నది కీలకంగా మారింది.