ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తాను అని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2021 లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి చివరకు తుది జట్టు నుంచే బయటికి వచ్చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ఆసీస్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక నిన్న ఆసీస్ శ్రీలంక పై ఆసీస్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన వార్నర్ అనతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఐపీఎల్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మొదట తుది జట్టు నుండి తొలగించడం పై స్పందిస్తూ.. నన్ను తీసేసిన సమయంలో చెప్పిన కారణం వల్ల నాకు చాలా నవ్వు వచ్చింది. జట్టులో ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లు నాకంటే బాగా ఆడుతున్నారు అని… అలాగే నేను మ్యాచ్ ఆడుతున్నప్పుడు సరిగ్గా ఫోకస్ తో ఆడటం లేదు అంటూ వివరణ ఇచ్చారు అని వార్నర్ అన్నాడు.
ఇక అలాగే ఆ జట్టులో ఉండే విషయం పై మాట్లాడుతూ… గత ఐపీఎల్ లో జరిగిన సంఘటనలను బట్టి చూస్తే వారు నన్ను రిటెన్ చేసుకుంటారు అనిపించడం లేదు. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం జరిగే మెగా వేలంలో నేను ఉంటాను అని వార్నర్ స్పష్టం చేసాడు.