NTV Telugu Site icon

Ashes 2023: ‘చీటర్’ అని పిలిచిన ఇంగ్లండ్ ఫాన్స్.. వార్నర్ రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు! వైరల్ వీడియో

David Warner Test

David Warner Test

David Warner Reaction Goes Viral After England Fans Calls Him Cheat: 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్‌కు (Ball Tampering) పాల్పడిన విషయం తెలిసిందే. విజయం సాధించడం కోసం శాండ్‌ పేపర్ సాయంతో బంతి రూపాన్ని మార్చి కెమెరాకు చిక్కారు. దాంతో ముగ్గురిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బాన్‌క్రాఫ్ట్ ఆరు నెలలు.. స్మిత్, వార్నర్‌లు సంవత్సరం పాటు శిక్ష కూడా అనుభవించారు. ఈ బాల్‌ ట్యాంపరింగ్‌తో ఆస్ట్రేలియా టీమ్ ప్రతిష్ట మసకబారిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈ మరకను మాత్రం వదిలించుకోలేకపోయింది.

5 సంవత్సరాలు గడిచినా ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను బాల్ టాంపరింగ్‌ మరక వెంటాడుతూనే ఉంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఫాన్స్ పదే పదే వారికి గుర్తుచేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా ‘ఛీటర్స్.. ఛీటర్స్’ అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. యూషెస్ సిరీస్ 2023లో కూడా ఇంగ్లీష్ ఫాన్స్ వార్నర్‌ను టార్గెట్ చేశారు. చీటర్స్, చీటర్స్ అంటూ స్టేడియంను మోతెక్కించారు.

Also Read: PCB Chairman: పీసీబీ ఛైర్మన్‌ సంచలన నిర్ణయం.. రేసు నుంచి వైదొలుగుతున్నా!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజున ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ స్మిత్‌ను ఇంగ్లీష్ ఫాన్స్ ఎగతాళి చేసారు. చీటర్.. చీటర్ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు తొలి రోజున ఆసీస్ ఫీల్డింగ్‌కు దిగుతున్న సమయంలో డేవిడ్ వార్నర్‌పై కామెంట్స్ చేశారు. వార్నర్ స్టెప్స్ దిగి మైదానంలోకి వస్తుండగా.. చీటర్ అని ఇంగ్లండ్ ఫాన్స్ అరిచారు. ఇది విన్న వార్నర్ ఆగి మరీ.. తన రెండు చేతుల్ని పైకి ఎత్తి ‘వావ్‌’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు.

ఇంగ్లండ్‌ అభిమానులు ఎగతాళి చేసినా.. కోపం తెచ్చుకోకుండా, అవమానంగా ఫీలవ్వకుండా డేవిడ్ వార్నర్ చాలా సరదాగా తీసుకున్నాడు. నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ దేవ్ భాయ్ సహనానికి ఫిదా అవుతున్నారు. వార్నర్‌కు ఇలాంటి చేదు అనుభవాలు గతంలో కూడా జరిగాయి. అప్పుడు కూడా ఇలానే ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాడు.

Also Read: Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!