Ashes 2023: ‘చీటర్’ అని పిలిచిన ఇంగ్లండ్ ఫాన్స్.. వార్నర్ రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు! వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner Reaction Goes Viral After England Fans Calls Him Cheat: 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్‌కు (Ball Tampering) పాల్పడిన విషయం తెలిసిందే. విజయం సాధించడం కోసం శాండ్ పేపర్ సాయంతో బంతి రూపాన్ని మార్చి కెమెరాకు చిక్కారు. దాంతో ముగ్గురిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బాన్‌క్రాఫ్ట్ ఆరు నెలలు.. స్మిత్, వార్నర్‌లు సంవత్సరం పాటు శిక్ష కూడా అనుభవించారు. ఈ బాల్ ట్యాంపరింగ్‌తో ఆస్ట్రేలియా టీమ్ ప్రతిష్ట మసకబారిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈ మరకను మాత్రం వదిలించుకోలేకపోయింది.
5 సంవత్సరాలు గడిచినా ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను బాల్ టాంపరింగ్ మరక వెంటాడుతూనే ఉంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఫాన్స్ పదే పదే వారికి గుర్తుచేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా ‘ఛీటర్స్.. ఛీటర్స్’ అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. యూషెస్ సిరీస్ 2023లో కూడా ఇంగ్లీష్ ఫాన్స్ వార్నర్‌ను టార్గెట్ చేశారు. చీటర్స్, చీటర్స్ అంటూ స్టేడియంను మోతెక్కించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
Also Read: PCB Chairman: పీసీబీ ఛైర్మన్ సంచలన నిర్ణయం.. రేసు నుంచి వైదొలుగుతున్నా!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజున ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ స్మిత్‌ను ఇంగ్లీష్ ఫాన్స్ ఎగతాళి చేసారు. చీటర్.. చీటర్ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు తొలి రోజున ఆసీస్ ఫీల్డింగ్‌కు దిగుతున్న సమయంలో డేవిడ్ వార్నర్‌పై కామెంట్స్ చేశారు. వార్నర్ స్టెప్స్ దిగి మైదానంలోకి వస్తుండగా.. చీటర్ అని ఇంగ్లండ్ ఫాన్స్ అరిచారు. ఇది విన్న వార్నర్ ఆగి మరీ.. తన రెండు చేతుల్ని పైకి ఎత్తి ‘వావ్’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
ఇంగ్లండ్ అభిమానులు ఎగతాళి చేసినా.. కోపం తెచ్చుకోకుండా, అవమానంగా ఫీలవ్వకుండా డేవిడ్ వార్నర్ చాలా సరదాగా తీసుకున్నాడు. నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ దేవ్ భాయ్ సహనానికి ఫిదా అవుతున్నారు. వార్నర్‌కు ఇలాంటి చేదు అనుభవాలు గతంలో కూడా జరిగాయి. అప్పుడు కూడా ఇలానే ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాడు.
Also Read: Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!
Best one yet 😄
#ashes #CricketTwitter #Ashes23 #Bazball #DavidWarner @davidwarner31 pic.twitter.com/QwcT9G16Y9— Sri Lankan Cricket Podcast (@srilankancripod) June 16, 2023
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!