NTV Telugu Site icon

David Warner: మూడేళ్ల తర్వాత సెంచరీ దాహం.. వందో టెస్టులో ‘వంద’నం

David Warner

David Warner

David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. మూడేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఈ మేరకు అతడు వందో టెస్టులో సెంచరీ సాధించి సత్తా చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ శతకం బాదాడు. దీంతో టెస్టుల్లో 25వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే వందో టెస్టులో సెంచరీ చేసిన వార్నర్.. గతంలో వందో వన్డేలోనూ సెంచరీ చేశాడు. దీంతో వందో టెస్టు, వందో వన్డేలో వంద పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.

Read Also: Japan Snow Storm: జపాన్‌ని చిదిమేసిన మంచు తుఫాన్.. 17 మంది మృతి

అటు 100వ టెస్టులో సెంచరీ బాదిన పదో ఆటగాడు డేవిడ్ వార్నర్. గతంలో ఇంగ్లండ్ ఆటగాడు కొలిన్, పాకిస్థాన్ ఆటగాడు జావెద్ మియాందాద్, వెస్టిండీస్ ఆటగాడు గ్రీనిడ్జ్, ఇంగ్లండ్ ఆటగాడు అలెక్ స్టివార్ట్, పాకిస్థాన్ ఆటగాడు ఇంజమాముల్ హక్, ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఈ ఘనత సాధించారు. వందో టెస్టులో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఒక్క భారత క్రికెటర్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం.