CSK vs RCB: దుమ్మురేపుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Scored 97 Runs In First 10 Overs Against RCB: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఆడుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చితక్కొడుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. తొలుత మ్యాచ్ ఆరంభమైనప్పుడు చెన్నై ఇన్నింగ్స్ నిదానంగానే మొదలైంది. సిరాజ్, పార్నెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ వికెట్‌ని సిరాజ్ తీసుకున్నాడు. అతడు వేసిన టెంప్టింగ్ బాల్‌ను షాట్ కొట్టబోయి.. క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పుడు అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. వచ్చి రాగానే రహానే బౌండరీలు బాదడం ప్రారంభించాడు. అతడ్ని చూసి కాన్వే సైతం రెచ్చిపోయాడు.
Minister Sidiri Appalaraju : పవన్ మాటల వెనుక అంతర్యం ఏమిటి..?
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆర్సీబీ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీలుగా మలిచారు. ఫలితంగా.. చెన్నై స్కోరు పరుగులు తీసింది. రెండో వికెట్‌కి వీళ్లిద్దరు కలిసి ఏకంగా 74 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. 90 పరుగుల వద్ద హసరంగ వేసిన గూగ్లీ బంతికి రహానే బౌల్డ్ అయ్యాడు. మరోవైపు.. కాన్వే అర్థశతకం చేసుకున్నాడు. రహానే ఇచ్చిన జోష్‌తో చెలరేగిపోయిన అతడు.. ఏకధాటిగా షాట్లు ఆడుతున్నాడు. అందుకే.. 10 ఓవర్లలోనే సీఎస్కే 9.7 రన్ రేట్‌తో 97 పరుగులు చేయగలిగింది. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికొస్తే.. మహమ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హసరంగా 2 ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
RCB vs CSK: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!