IPL 2022: సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా ఐపీఎల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ వెయ్యి పరుగులు సాధించాడు.
దీంతో సచిన్ రికార్డును రుతురాజ్ గైక్వాడ్ సమం చేశాడు. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సైతం ఐపీఎల్ కెరీర్లో 31 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగుల ఘనత అందుకున్నాడు. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 10 కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలను చేసిన భారత ఆటగాడినూ నిలిచాడు. 31 ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ 10 హాఫ్ సెంచరీలు చేయగా.. 38 ఇన్నింగ్స్‌లలో సచిన్, 40 ఇన్నింగ్స్‌లలో శ్రేయస్ అయ్యర్ 10 హాఫ్ సెంచరీలు చేశారు. కాగా ఓవరాల్ ఐపీఎల్లో 31 ఇన్నింగ్స్‌లు ఆడి ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లలో రుతురాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 31 ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ గైక్వాడ్ 1076 పరుగులు చేశాడు. సచిన్ 1064 పరుగులు, దేవదత్ పడిక్కల్ 932, సురేశ్ రైనా 928, గౌతం గంభీర్ 901 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!