IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Eyes on Liam Livingstone Ahead of IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ క్రీడా ఛానెల్ క్రిక్‌బజ్ తన కథనంలో వెల్లడించింది.
ఐపీఎల్ 2026 వేలానికి ముందు లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన లివింగ్‌స్టోన్ 15 పరుగులు చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా మిగిలిన మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్‌ను ట్రేడ్ చేసుకునే అంశాన్ని సీఎస్కే పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో ఫ్రాంచైజీ కూడా అతడిపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్రేడ్ విషయంలో సన్‌రైజర్స్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని క్రిక్‌బజ్ పేర్కొంది.
Also Read
- Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే 'వావ్' అనాల్సిందే.!
- Mumbai Indians: "సూర్యకుమార్‌ను వదులుకోం".. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
- IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
- NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
లియామ్ లివింగ్‌స్టోన్ 2019లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పట్లో అతడిని ఆర్ఆర్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 2021 సీజన్ తర్వాత అతడి విలువ గణనీయంగా పెరిగింది. 2022 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ.11.5 కోట్లు వెచ్చించింది. 2025 సీజన్‌కు ముందు పంజాబ్ అతడిని విడుదల చేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది. అనంతరం 2026 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
-
REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!