Pakistan batter Sohaib Maqsood comments on India wins against pak: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోరంటే ఇరు దేశాలకు ఎంతో కీలకం. ఈ రెండు జట్ల మధ్య పోటీపై క్రీడా ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. అయితే ప్రపంచ కప్ టోర్నీల్లో ఒక్కసారి తప్పితే భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ పై ఆదిపత్యం చెలాయిస్తూ గెలుస్తూ వచ్చింది. 2022 టీ 20 ప్రపంచ కప్ లో చివరి సారి పాకిస్తాన్, ఇండియా చివరి సారిగా తలపడ్డాయి. బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్, భారత్ ను ఓడించింది. అయితే ఈ విజయానికి ముందు అన్ని 50, 20 ఓవర్ల ప్రపంచ కప్ టోర్నీల్లో భారత్, పాకిస్తాన్ ను ఓడించింది. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో మొత్తం 13 మ్యాచులు జరిగితే.. 12సార్లు ఇండియానే విజయం సాధించింది.
Read Also: Marriage of two women: ఆయనకు విడాకులు.. ఆమెను పెళ్లి చేసుకుంది.. కానీ, మరో ట్విస్ట్..!
ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రపంచ కప్ టోర్నీల్లో ఓడిపోవడంపై పాక్ బ్యాటర్ సోహైల్ మక్సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్ వంటి మేజర్ టోర్నీల్లో పాకిస్తాన్ నిలకడ లేమికి మా జట్టు ‘‘అతి ఉత్సాహమే’ కారణమని వెల్లడించారు. భారత్ తో మ్యాచ్ ముందు పాక్ జట్టు అత్యుత్సాహం ప్రదర్శించేదని ఇదే తమ ఓటములకు కారణం అయిందని సోహైల్ మక్సూద్ అన్నారు. అయితే ఇటీవల కాలంలో భారత్ తో మ్యాచును పాకిస్తాన్ సాధారణంగా చూడటం ప్రారంభించిందని.. దీని వల్లే మా జట్టు ప్రదర్శన మెరుగుపడుతోందని ఆయన అన్నారు.
గత టీ20 వరల్డ్ కప్ లో గాయం కారణంగా సోహైల్ మక్సూద్ జట్టుకు దూరం అయ్యాడు. అయితే గాయాల కారణంగా పాక్ జట్టు నుంచి చాలా సార్లు బయటకు వెళ్లాల్సి వచ్చిందని.. మళ్లీ పాక్ జట్టుకు ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని.. మక్సూద్ అన్నారు. సోహైల్ మక్సూద్ పాకిస్తాన్ తరుపున మొత్తం 29 వన్డేలు, 26 టీ20లు ఆడాడు.
