Site icon NTV Telugu

IND Vs SL: టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. చెలరేగిన వివాదం

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు .

గతంలో పాకిస్తాన్‌ గడ్డపై 2004లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఇలాంటి సీన్ జరిగింది. సెహ్వాగ్(309)తో పాక్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అదే మ్యాచ్‌లో సచిన్ కూడా 194 పరుగుల వద్ద ఉండగా ద్రవిడ్ డిక్లేర్డ్ అని ప్రకటించాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద వివాదమే రేగింది. కాగా రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలతో కలిసి ఆరు, ఏడో, 9వ వికెట్లకు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. గతంలో వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్ పేరిట ఈ ఫీట్ నమోదైంది.

Exit mobile version