Site icon NTV Telugu

Kohli vs Gambhir: కోహ్లీ- గంభీర్ మధ్య మళ్లీ గొడవ.. ఈసారి ఏకంగా స్టేడియంలోనే..?

Gambir

Gambir

Kohli vs Gambhir: దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ప్రదర్శించిన హావభావాలు సరి కొత్త వివాదానికి దారి తీశాయి. సిరీస్ అంతా మంచి ఫామ్‌ను ప్రదర్శించిన కోహ్లీ (302 పరుగులు, 2 సెంచరీలు) మ్యాచ్ ముగిశాక సహచర ఆటగాళ్లందరిని ఉత్సాహంగా కౌగిలించుకున్నాడు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కోహ్లీ హత్తుకోవడం మైదానంలో ఉన్న అభిమానులను అలరించింది. అయితే ఇదే ఉత్సాహం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గర మాత్రం కనిపించలేదు. గంభీర్‌ను కోహ్లీ కలిసి కౌగిలించుకోకుండా, కేవలం హ్యాండ్‌షేక్ ఇవ్వడంతోనే సరిపెట్టాడు. ఈ సందర్భంగా కింగ్ కోహ్లీ ముఖంలోని హావభావాలనుచూస్తుంటే ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు చెలరేగినట్లు అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గంభీర్- కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: Hindu Rate Of Growth: ‘‘హిందూ వృద్ధిరేటు’’పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.. అసలేంటి ఇది..

ఐపీఎల్ వివాదాల నేపథ్యం మళ్లీ చర్చలోకి
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య గత కొంత కాలంగా సంబంధాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతంలో ఐపీఎల్‌లో వీరు బహిరంగంగా గొడవ పడటం, అలాగే, కోచ్ గంభీర్ ‘స్ప్లిట్ కోచింగ్’ గురించి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ యజమానితో వివాదంలో పడిన నేపథ్యం కూడా ఉంది. టీం విజయం తర్వాత విరాట్ కోహ్లీ ప్రదర్శించిన ఈ ప్రత్యేక వైఖరి, డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత ఘర్షణలు కొనసాగుతోందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతుంది. ఇక, కోహ్లీ, రోహిత్ శర్మ జనవరి 11వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మళ్లీ రంగంలోకి దిగనున్నారు.

Exit mobile version