SRH vs CSK: టాస్ గెలిచిన సీఎస్కే.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Super Kings Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 29వ మ్యాచ్. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్ స్టేడియం) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. రెండు వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్‌కు గత మ్యాచ్‌లో ముంబై కళ్లెం వేయడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఆ జట్టు కసి మీద ఉంది. మరోవైపు.. గత మ్యాచ్‌లో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన ధోనీ సేన.. ఈ మ్యాచ్‌లోనూ అదే కొనసాగించి, విజయం సాధించాలని పూనుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
Coldest Places: ప్రపంచంలోని 9 అత్యంత శీతల ప్రదేశాలు
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?

అయితే.. చెన్నై జట్టులో బ్యాటర్లు చాలామంది ఉన్నారు. ఏడో వికెట్ దాకా మెరుపులు మెరిపించే బ్యాటర్లు ఆ జట్టు సొంతం. అలాంటి జట్టుపై సన్‌రైజర్స్ రాణించాలంటే.. టాపార్డర్ అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన బ్రూక్.. ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అతనితో పాటు రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ కూడా తమవంతు కృషి అందిస్తే.. చెన్నైకి గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఇవ్వొచ్చు. ఇక్కడ మరో చిక్కు ఏమిటంటే.. ఈ మ్యాచ్ చెన్నై సొంత మైదానంలో జరగుతుంది. ఇంతవరకూ హోమ్ గ్రౌండ్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 19 గెలుపొందింది. దీన్ని బట్టి.. హోమ్ గ్రౌండ్‌లో ఆ జట్టుకి ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. చెపాక్ స్టేడియంలో చెన్నైని ఓడించాంటే, సన్‌రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. చూద్దాం.. ఎవరెలాంటి ప్రదర్శనతో ఆధిపత్యం చెలాయిస్తారో?
Shane Watson: కోహ్లీ కడుపులో మంట కావొచ్చు.. కోహ్లీ-గంగూలీ వివాదంపై షేన్ వాట్సన్
తుది జట్లు:
సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా
ఎస్ఆర్‌హెచ్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!