NTV Telugu Site icon

IPL 2023 : ఢిల్లీపై సీఎస్కే ఘన విజయం.. ప్లే ఆఫ్స్ కు ధోని సేన..

Csk Won

Csk Won

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది. 224 పరుగుల భారీ టార్గె్ట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 149 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ( 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 86 పరుగులు ) ఒక్కడే అర్థ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లలో పృథ్వీ షా ( 5), ఫిల్ సాల్ట్‌(3), రిలీ రూసో(0), అక్షర్ పటేల్ (13)లు విఫ‌లం అయ్యారు.

Also Read : IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మతీష పతిరణ, మహేశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా తల ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 79 పరుగులు ) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ తో 87 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేశారు. వీరికి తోడు శివమ్ దూబే ( 9 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు ) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు చివర్లో రవీంద్ర జడేజా ( 7బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు ) అద్భుతమైన షాట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 223 పరుగులు మార్క్ ను చేరుకుంది. ఢిల్లీ బౌల‌ర‌ల్లో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ టీమ్ ఫస్ట్ ఫ్లే ఆఫ్స్ కు వెళ్లింది.

Also Read : Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్