Site icon NTV Telugu

Champions Trophy: భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ అక్కడే.. నేడే షెడ్యూల్ విడుదల!

Champions

Champions

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ మాటే నెగ్గింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్‌ మోడల్‌తో ఛాపియన్స్‌ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్‌ నక్వీతో ఈ రోజు (డిసెంబర్ 14) స్వయంగా ప్రకటన వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, పీసీబీ చీఫ్‌ ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ కు సంబంధించి ప్రకటన చేస్తారని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి వర్గాలు తెలిపాయి.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి విజయ్ దేవరకొండ

కాగా, ఐసీసీ చైర్మన్‌ జై షా బ్రిస్బేన్‌ నుంచి వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. 2025లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ ఒక్క టోర్నీయే కాదు.. ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లు అన్ని కూడా హైబ్రిడ్‌ మోడల్ లోనే నిర్వహించనున్నారు. అంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాకిస్తాన్‌ ఇక్కడకు రాదు అన్నమాట. అయితే, భారత్‌ లాగే పాకిస్థాన్ మ్యాచ్‌ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొనింది. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్‌ కూడా హైబ్రిడ్‌ మోడలోనే జరగనుంది.

Exit mobile version