ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్ లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు. హోప్ వేదికగా డర్హమ్ తో మ్యాచ్ తొలి ఇన్సింగ్స్ లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్ లో బ్రైడన్ బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజారా.. తన సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. 134 బంతుల్లో పుజారా శతకం కొట్టాడు. టామ్ క్లార్క్ తో కలిసి 112 పరుగులు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఓవరాల్ గా తొలి ఇన్సింగ్స్ లో 163 బంతులు ఎదుర్కొన్న పుజారా 13 ఫోర్లు, ఒక సిక్స్ తో 115 పరుగులు చేశాడు.
Also Read : Yerrabelli dayaker Rao: ఉపాధి హామీ పథకం ఎందుకు కక్ష.. రెండు లక్షల పోస్ట్ కార్డులతో నిరసన
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజారా టాప్ స్కోరర్ గా నిలవగా.. ఓలివర్ కార్టర్ ( 41) పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్సింగ్ లో 376 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్ లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జూన్ 7 తారీఖున లండన్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. ఈసారి ఎలాగైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కప్ కొట్టాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
Also Read : Agent: అక్కినేని కుర్రాడు స్పీడ్ పెంచాడు…