భారత స్టార్ పేసర్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టీ 20 ఫార్మటు లో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు బుమ్రా. అయితే నిన్నటి వరకు చహల్ 49 టీ 20 ల్లో 63 వికెట్లతో మొదటి స్థానంలో ఉంటె… స్కాంట్లాండ్ తో మ్యాచు ముందు బుమ్రా 62 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం వల్ల చహల్ ను అధిగమించాడు బుమ్రా. అయితే ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (55), భువనేశ్వర్ కుమార్ (50), రవీంద్ర జడేజా (43), ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా (42)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 117 వికెట్లతో మొదటి స్థానంలో… తర్వాత శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 107, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 102 తో టాప్ 3 లో ఉన్నారు.