Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్ల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ.. తిరిగి జాతీయ జట్టులోకి రావాలని తాను ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రయత్నించలేదని వెల్లడించాడు. తన కుటుంబం అందించిన మద్దతు, ప్రస్తుతంపై దృష్టి పెట్టడం, ఎలాంటి అంచనాలు లేకుండా ఆటను కొనసాగించడం తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయని తెలిపాడు. 2022 తర్వాత తొలిసారి న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టీ20లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న భువీ.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్లో వరుసగా నిలకడైన ప్రదర్శనలు చేయడంతో 36 ఏళ్ల ఈ పేసర్‌కు తిరిగి భారత జట్టులో అవకాశం లభించింది.
బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో భువనేశ్వర్ కుమార్ తన పునరాగమన ప్రయాణం గురించి వివరించాడు. ఈ సందర్భంగా తన కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘కుటుంబం గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. కానీ నా కుటుంబానికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. ఒక్కరోజు కూడా రీఎంట్రీ గురించి మాట్లాడలేదు. అది నా ప్రయాణంలో చాలా కీలక పాత్ర పోషించింది.పునరాగమనంలో నా ఆటతీరుపై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. గత మూడు, నాలుగేళ్లలో నా ప్రయాణం సాఫీగా సాగింది. ఎలాంటి అంచనాలు లేకుండా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. ప్రస్తుతంలో ఉండాలి, భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అని సాధారణంగా చెబుతుంటాం. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా’ అని భువనేశ్వర్ చెప్పాడు.
Also Read
- Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
- Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
- Women's T20 World Cup: పాకిస్థాన్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ vs పాక్ మ్యాచ్ ఎక్కడంటే..?
- Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
మళ్లీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని భువనేశ్వర్ తెలిపాడు. ‘ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నా. టీమిండియాకు ఆడకపోయినా శ్రమించడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. వ్యక్తిగతంగా ఆ పరిణతిని నేను సాధించా. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప గర్వం మరొకటి ఉండదు. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని భువీ భావోద్వేగంగా చెప్పాడు. భారత జట్టుకు దూరంగా ఉన్న సమయంలో భువనేశ్వర్ తన కెరీర్‌ను ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పెట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో 31 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. 22.55 సగటు, 8.52 ఎకానమీతో రాణించాడు. అతడి ప్రదర్శన ఆర్సీబీకి 2025, 2026 సీజన్లలో వరుసగా రెండు టైటిళ్లు సాధించడంలో కీలకంగా నిలిచింది.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టాడు. అయితే ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో భువీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండో టీ20లో కూడా ఈ వెటరన్ పేసర్ నిరాశపరిచాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 50 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. భువీ తిరిగి గాడిన పడాలని ఆయన ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!