Site icon NTV Telugu

Ben Stokes: మందుకు బానిస అయ్యా.. బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం

Benstokes

Benstokes

ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగుతుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్ ఇంగ్లాండ్ టూర్‌లో కఠిన సవాళ్లు ఎదుర్కోనుంది. ఇంగ్లాండ్‌లో విధ్వంసకర ఆటగాళ్లున్నారు. బెన్ స్టోక్స్ తిరిగి జట్టులో చేరాడు. దీంతో టీమిండియా పటిష్ట ఇంగ్లాండ్‌ను ఎలా ఎదుర్కొంటున్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాలో కనిపించని పశ్చాత్తాపం.. ఐబీ ఆశ్చర్యం

మరోవైపు టీమిండియా అంతు చూసేందుకు స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాను ఓడించడమే పనిగా పెట్టుకుని కొన్ని నెలలపాటు మందు జోలికి వెళ్ళలేదంట. ఇంతకీ ఎం జరిగిందంటే.. గత కొంత కాలంగా బెన్ స్టోక్స్ గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. గతేడాది డిసెంబర్ తర్వాత స్టోక్స్ పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. కొన్ని నెలలపాటు స్టోక్స్ రీహాబిలిటేషన్ సెంటర్లోనే గడిపాడు. ఈ సమయంలో తొడకండరాల చికిత్సకు తన బాడీ సహకరించలేదట. విపరీతంగా మధ్య తాగడం వల్లనే అతనికి మెడిసిన్ కూడా పనిచేయలేదు. పైగా త్వరలో భారత్ తో టెస్ట్ సిరీస్ ఉంది. ఈ నేపథ్యంలో మద్యానికి దూరంగా ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఎలాగైనా భారత్‌తో టెస్ట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో త్వరగా కోలుకునేందుకు కష్టమైనా.. మందుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం స్టోక్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న స్టోక్స్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో యువ భారత్ పై ఎలా రెచ్చిపోతాడో చూడాలి. డబ్ల్యూటీసీ సైకిల్‌లో జరిగే తొలి సిరీస్ ఇదే కావడంతో హెడ్ కోచ్ గంభీర్ కూడా భారీ ప్రణాళికతో బరిలోకి దిగనున్నాడు. సీనియర్లు లేకపోయినా సత్తా ఉన్న కుర్రాళ్లని దింపుతున్నాడు.

ఇది కూడా చదవండి: Bengaluru: టెక్ సిటీనా? పల్లెటూర్‌నా? బెంగళూరు రోడ్లపై 50లక్షల నోటీసు

Exit mobile version