Site icon NTV Telugu

BCCI: రిషబ్ పంత్ ఐసీయూలో ఉన్నాడు.. ప్రకటించిన బీసీసీఐ

Bcci

Bcci

BCCI: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంపై బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. పంత్ నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలు అయ్యాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మణికట్టు, బొటనవేలితో పాటు వీపు భాగంలో గాయాలు అయ్యాయని బీసీసీఐ తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో చెప్పుకొచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునే వరకు బోర్డు అండగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ వివరించింది.

Read Also: Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

కాగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో టీమిండియా వికెట్ కీపర్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో పంత్‌ను వెంటనే స్థానికులు సమీపంలోని సాక్షమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా పంత్ ఓ ఫైటర్ అని, అతడు పూర్తిగా కోలుకోని మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మొత్తం అతనికి అండగా ఉంటుందని స్పష్టం చేశాడు.

Exit mobile version