ఈ నెలలో భారత జట్టు వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటన పై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ప్రస్తుతం ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో అయితే ఈ పర్యటన కొనసాగుతోంది. కానీ మాకు ఇంకా నిర్ణయించుకోవడానికి సమయం ఉంది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు చాలా ముఖ్యం కాబట్టి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూద్దాం అని గంగూలీ పేర్కొన్నారు. ఇక నిన్న బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. టీం ఇండియాను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపాలంటే మమల్ని సంప్రదించాలి అని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పడంతో… భారత ప్రభుత్వ సలహా ఏదైనా, మేము దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పారు.
సౌత్ ఆఫ్రికా పర్యటనపై గంగూలీ కీలక వ్యాఖ్యలు…
