వివాదంలో గంగూలీ.. రెండుగా చీలిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది.
అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ రెండుసార్లు హాజరయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంలో గంగూలీపై చాలా మంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తనకు సంబంధం లేని సెలక్షన్ సమావేశాలకు గంగూలీ ఎందుకు వెళ్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. దీంతో బీసీసీఐ రెండుగా చీలింది. గంగూలీ తీరును కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
- Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
- Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ప్రస్తుతం బీసీసీఐ వ్యవహారాలన్నీ మారిపోయాయని.. అసలు సెలక్షన్ కమిటీ సమావేశాలకు గంగూలీ రావాల్సిన అవసరమేంటని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు గంగూలీపై క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు గంగూలీ ఎప్పుడూ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. తాజా వివాదం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు గంగూలీ, జై షా వారి పదవుల్లో కొనసాగాల్సి ఉన్నా.. అప్పటిదాకా ఉంటారా? అన్న చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్‌లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!