ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ మ్యాచ్ కోసం కొన్ని రోజుల కిందట ఇంగ్లండ్ కు వెళ్లిన భారత జట్టు అక్కడ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఆసీస్ సిరీస్ లో గాయం బారిన పడిన ఆల్‌రౌండర్ జడేజా, హనుమ విహారి, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ తో తలపడే న్యూజిలాండ్ జట్టును కూడా కివీస్ బోర్డు ముందే ప్రకటించింది.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(c), అజింక్య రహానె(vc), హనుమ విహారి, రిషభ్ పంత్(wk), సాహా(wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.