Site icon NTV Telugu

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

Shubman Gill’s Run Out

Shubman Gill’s Run Out

దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డ గిల్‌.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే బ్యాటింగ్ కూడా చేయలేదు. నవంబర్ 22 నుంచి గువాహటిలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ ఆరంభం కానుంది. ఈ టెస్ట్‌లో గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది.

ట్రీట్‌మెంట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ స్పందిస్తున్నాడని బీసీసీఐ చెప్పింది. భారత జట్టుతో పాటుగా గువాహటి అతడు వెళ్లనున్నట్లుగా తెలిపింది. అయితే గిల్‌ రెండో టెస్ట్‌లో ఆడేది లేనిది మాత్రం తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. రెండో టెస్ట్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉందని, పరిస్థితులను బట్టి రెండో టెస్ట్‌లో ఆడతాడో లేడో తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని బీసీసీఐ చెప్పుకొచ్చింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్ గిల్‌ను నిత్యం పర్యవేక్షిస్తోంది. సాధ్యమైనంత వరకు గిల్‌ను రెండో టెస్ట్‌లో ఆడించాలనే టీమ్ మేనేజ్మెంట్ చూస్తోందని సమాచారం.

Also Read: Bhuvneshwar Kumar: ఇప్పుడేం కొత్త కాదుగా.. కోల్‌కతా పిచ్‌పై భువీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

రెండో టెస్ట్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆడలేకపోతే.. వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. గిల్‌ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారో అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. సాయి సుదర్శన్, దేవ్‌దత్‌ పడిక్కల్‌ పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ రానుంది. ఇప్పటికే జట్టులో ఆరుగురు లెఫ్ట్‌హ్యాండర్‌ బ్యాటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఏదైనా ప్రయోగం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే జట్టులో ఉన్నాడు. గిల్ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌కు అవకాశం కల్పించాలని మాజీలు అంటున్నారు.

Exit mobile version