BCCI Emergency Meeting: దక్షిణాఫ్రికాతో బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్న రెండో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభతేజ్ సింగ్ భాటియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పాల్గొనే అవకాశం ఉంది. ఇక, కొత్తగా నియమితులైన బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఈ మీటింగ్ కు హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే, ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలను అత్యవసరంగా పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శనలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు టాక్. అలాగే, జట్టు ఎంపికలో స్థిరత్వం ఉండేలా చూసుకోవడంతో పాటు సుదీర్ఘకాలంగా జట్టు పర్ఫామెన్స్ ని దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ ఏర్పాటు చేయబడిందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.
Read Also: శాంసంగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. Samsung Galaxy S25 Edgeపై 20 వేల తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అదనం!
కాగా, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి సమయంలో భారత జట్టులో కనిపించిన లోపాలను పరిష్కరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అలాగే, గంభీర్- అగార్కర్ ఇద్దరూ ఈ మీటింగ్ లో పాల్గొనడంతో.. భవిష్యత్తులో జట్టు ఎలా ఆడాలి అనే దానిపై ప్లాన్ చేయాలని బోర్డు భావిస్తోంది. ఇక, వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో గెలిపే లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్లాలని సూచించే అవకాశం ఉంది. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్‌కు బలమైన పోటీదారులుగా టీమిండియా ఉంటుంది, ప్రస్తుతం టీంలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని చూస్తుంది.
