Site icon NTV Telugu

IND Vs BAN: తొలి వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. టీమిండియా నుంచి బరిలోకి కొత్త ఆటగాడు

First Odi

First Odi

IND Vs BAN: బంగ్లాదేశ్‌ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత్‌ ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా కుల్‌దీప్ సేన్‌ను బరిలోకి దించుతోంది. అటు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టిన టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది.

Read Also: కుర్రాళ్లకు కేక పుట్టిస్తున్న పూజ నడుము ఊపు

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో పోలిస్తే భిన్నమైన జట్టుతో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బరిలోకి దిగనుండగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్‌ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ఫామ్‌తో విమర్శలను ఎదుర్కొన్న రోహిత్‌, కేఎల్ రాహుల్‌ బంగ్లాదేశ్‌పై చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version