దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి వరుస సక్సెస్‌లతో ఉన్న ఈ భామ జైత్రయాత్రకు ప్రభాస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ బ్రేకులు వేసింది.

రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు అంతగా నడవకపోయినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. ఇక రంగస్థలం తర్వాత మరోసారి ఎఫ్ 3లో ఐటెం భామగా చిందేసింది.

పూజా హెగ్డే... మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఓకే చెప్పింది. మహేష్ బాబుతో ఈమెకు ఇది రెండో సినిమా.

అటు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలు చేస్తోంది.

ఇక రణ్‌వీర్ సింగ్‌తో చేస్తోన్న సర్కస్ సినిమా డిసెంబర్ 23 విడుదల అవుతోంది.

మొత్తంగా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతోంది.