Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
- మహ్మద్ యూనస్ ఎగ్జిట్..
- భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ ఆరాటం..
- సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్న కొత్త మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ తన రాజకీయ స్వలాభం కోసం భారత్‌ను బూచిగా చూపించే విధంగా గేమ్ ఆడారు. బంగ్లా ప్లేయర్లు భారత్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్‌తో భద్రతా సమస్యలు ఉన్నాయని తమ టీం అక్కడ ఆడదంటూ వితండవాదం చేశారు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి నిషేధించింది.
Read Also: Mumbai Court: మైనర్ బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తారిక్ రెహ్మాన్ నేతృత్వంలో బీఎన్పీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. మహ్మద్ యూనస్ అధికారం పోయింది. దీంతో, ఇప్పుడు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. క్రికెట్ సంబంధాలను మళ్లీ నెలకొల్పాలని బంగ్లా కొత్త క్రీడా మంత్రి అమీనుల్ హక్ భావిస్తున్నారు. భారత డిప్యూటీ హైకమిషనర్‌తో చర్చలు జరిపినట్లు హక్ చెప్పారు. ‘‘స్నేహపూర్వకం చర్చల’’ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగ్లాదేశ్ బోర్డును కూడా హక్ విమర్శించారు. పొరుగుదేశాలో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ఆయన అన్నారు. దౌత్యపరమైన సమస్య కారణంగా బంగ్లా టీం టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయిందని, ఒక వేళ చర్చించి పరిష్కరించుకుంటే ఇప్పుడు తమ టీం టోర్నీలో ఆడుతూ ఉండేదని ఆయన అన్నారు.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ మద్దతుదారులుగా ఉన్న క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, మష్రఫే మోర్తాజాపై ఉన్న కేసులను పరిష్కరించడం ద్వారా జాతీయ జట్టులోకి వస్తారని హక్ అన్నారు. గతంలో ఈ ఇద్దరు అవామీ లీగ్ ఎంపీలుగా పనిచేశారు. యూనస్ అధికారం చేపట్టిన తర్వాత విదేశాల్లో ఉంటున్న షకీబ్ బంగ్లాకు తిరిగిరాలేదు. ఇక మోర్తజా బహిరంగంగా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!