Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
- తొలి వన్డేలో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన
- బంతితో నాలుగు వికెట్లు, బ్యాటింగ్‌లో అర్ధ శతకం
- భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
- అక్షర్ పటేల్ అరుదైన ఘనత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బంతితో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాటింగ్‌లో అజేయ అర్ధ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. అక్షర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
బౌలింగ్‌లో అక్షర్ పటేల్ తన 10 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 259 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 165 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేర్చాడు. అక్షర్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్ (52) కూడా అజేయ అర్ధశతకం సాధించాడు.
Also Read
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ఈ ప్రదర్శనతో అక్షర్ పటేల్ భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే వన్డే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక జాబితాలో ఇప్పటికే క్రిష్ణమాచారి శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ (రెండుసార్లు), యువరాజ్ సింగ్ (రెండుసార్లు), హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా వారి సరసన చేరాడు.
భారత్ తరఫున ఒకే వన్డేలో 50కి పైగా పరుగులు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అక్షర్ చేరడం విశేషం. 1988లో న్యూజిలాండ్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఘనత సాధించగా.. 1998లో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్, 1999 అండ్ 2000లో సౌరవ్ గంగూలీ, 2008 అండ్ 2011లో యువరాజ్ సింగ్, 2022లో హార్దిక్ పాండ్యా ఈ రికార్డును నమోదు చేశారు. ఇప్పుడు 2026లో ఇంగ్లండ్‌పై అక్షర్ పటేల్ కూడా అదే ఘనతను అందుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత జట్టు వివిధ కాంబినేషన్లను పరీక్షిస్తున్న తరుణంలో అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన టీమ్ మేనేజ్మెంట్కు భారీ ఊరటనిచ్చింది.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!