Axar Patel: ధోనీ 17 ఏళ్ల రికార్డ్ బద్దలు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel Breaks MS Dhoni Record After 17 Years: వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ చెలరేగిపోయాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన అక్షర్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కేవలం 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇతను ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో లక్ష్య చేధనలో భాగంగా.. జట్టు తరఫున 7 లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి, అత్యధిక సిక్సర్లు (5) బాది, జట్టుని గెలిపించిన ఆటగాడిగా అక్షర్ చరిత్రపుటలకెక్కాడు.
2005లో ధోనీ మూడు సిక్స్‌లు బాది.. తొలిసారిగా ఆ అరుదైన రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత 2011లో భారత మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ కూడా మూడు సిక్స్‌లు బాధి.. ధోనీ రికార్డ్‌ను సమం చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరి కంటే మరో రెండు సిక్స్‌లు ఎక్కువగా బాది.. వారి రికార్డుల్ని బద్దలు కొట్టాడు. అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా.. భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేయగలిగింది. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు కొట్టాల్సి ఉన్నప్పుడు.. భారత్ ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి.. కీలక ఇన్నింగ్స్ ఆడి, భారత జట్టుని గెలిపించాడు. దీంతో, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో ఈ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది.
Also Read
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!