NTV Telugu Site icon

IND vs AUS: గబ్బాలో భారత్ బౌలింగ్.. వర్షంతో ఆగిన ఆసీస్ బ్యాటింగ్

Aus Ind

Aus Ind

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ స్టార్ట్ అయింది. ఉదయం 5.50 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఈ మ్యాచ్లో మొదట టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ తీసుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు వచ్చింది. నేటి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ సేన భారీ మార్పులు చేసింది. అందరు అనుకున్నట్లే హర్షిత్ రానాను జట్టు నుంచి పక్కన పెట్టేసింది. అతడి స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చాడు. అటు నితీష్ కుమార్ రెడ్డిని కూడా తప్పిస్తారని ప్రచారం జరిగింది.. కానీ అతడు తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

Read Also: Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల..

అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది.. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం 13.2 ఓవర్లకు ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇక, క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (19*), నాథన్ మెక్‌స్వీనీ (4*) నాటౌట్ గా ఉన్నారు. కాగా, గబ్బా టెస్టు తొలి రోజు ఆట మొదటి సెషన్‌ ముగియడంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు.

Show comments